సత్యజ్యోతి సంస్థతో పనిచేయడం గర్వకారణం
తమిళసినిమా: నటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మార్క్. నటుడు నవీన్ చంద్ర, విక్రాంత్, యోగిబాబు, దీప్షిక, రోష్నీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నటుడు కిచ్చ సుదీప్ సత్య జ్యోతి ఫిలిమ్స్ తో కలిసి తన కిచ్చా క్రియేషనన్స్ సంస్థపై నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఈనెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు విజయ్ కార్తీక్ మాట్లాడుతూ తాను ఈ వేదికపై నిలబడ్డటానికి ముఖ్య కారణం నటుడు కిచ్చా సుదీప్ అని పేర్కొన్నారు. అంత పెద్ద హీరోతో కలిసి రెండో చిత్రం చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఇంతకు ముందు మాక్స్ సినిమా చేశామని, తాజాగా మార్క్ చిత్రం చేసే అవకాశాన్ని కిచ్చ సుదీప్ కల్పించారని చెప్పారు. నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ తాను చాలా సంవత్సరాలుగా తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తున్నానని, అయితే కన్నడ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్ర కోసం ఎదురుచూశానని, మార్క్ చిత్రంలో అలాంటి అవకాశం కలగడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర కథానాయకుడు కిచ సుదీప్ మాట్లాడుతూ సత్యజ్యోతి ఫిలిమ్స్ వంటి గొప్ప సంస్థతో కలిసి మార్క్ వంటి సినిమాను చేయడం ఘనంగా ఉందన్నారు. కథ చెప్పే విధానం, కొత్త సన్నివేశాలు, వ్యాపారం, నటీనటుల ప్రదర్శన వంటి విషయాల్లో ప్రేక్షకులు కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని ఆశిస్తారన్నారు. అవన్నీ ఈ చిత్రంలో చేసామని నమ్ముతున్నామన్నారు. దర్శకుడు విజయ్ కార్తికేయన్ దర్శకత్వం అంటే తనకు ఇష్టం అన్నారు అందుకే మళ్లీ ఆయనతో కలిసి ఈ చిత్రం చేశానని చెప్పారు తన చెట్లు అత్యంత బిజీగా ఉండే నటుడు యోగిబాబు అని, ఆయన ఈ చిత్రం కోసం విడతల వారీగా వచ్చి నటించారని చెప్పారు. అదేవిధంగా ఈ చిత్రం కోసం దర్శకుడు, ఛాయాగ్రకుడు రాత్రింబవళ్లు కష్టపడినట్లు తెలిపారు.


