టాలీవుడ్ కింగ్ నాగార్జున తాత కాబోతున్నాడంటూ గత కొన్నినెలలుగా ప్రచారం ఊపందుకుంది. మొదట్లో నాగచైతన్య- శోభిత పేరెంట్స్ కాబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ, అదంతా ఉట్టిదేనని శోభిత టీమ్ కొట్టిపారేసింది. కొన్నిరోజులుగా అఖిల్-జైనబ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిల్ కానీ, అతడి ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
టైం వచ్చినప్పుడు చెప్తా..
ఈ క్రమంలో ఓ హెల్త్ ఈవెంట్‌కు వచ్చిన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి.. నిజమేనా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకాయన చిరునవ్వుతో.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని పేర్కొన్నాడు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
15 ఏళ్లుగా సమస్య
ఇకపోతే ఇదే ఈవెంట్ అనంతరం నాగార్జున తన మోకాలి నొప్పి గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా మోకాలినొప్పితో బాధపడుతున్నాను. సర్జరీ చేయించుకోవాలనుకోలేదు. కాకపోతే మోకాలు బెటర్ అయ్యేందుకు లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను. వైద్యులు పీఆర్‌పీ (ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా) చేశారు. ఒక్కోసారి నాకు నొప్పి లేకపోయినా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేశాను. దాన్ని అసలు వదిలేయలేదు. అలా మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు.


