మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్‌కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.
మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.


