breaking news
nilakantan
-
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. -
అమ్మ వయస్సు 68 ... ఆమె కోసం...
శ్రీకాళహస్తీశ్వరునికి వేడుకోలు అన్నాడీఎంకే అభ్యర్థి - 68 కిలోల వెండికవచం చెన్నై: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సహజంగా తమ గెలుపుకోసం దేవునికి మొక్కుకుంటారు. అయితే అన్నాడీఎంకేకు చెందిన అభ్యర్థి ఒకరు ఆర్కేనగర్ అభ్యర్థి జయలలిత కోసం మొక్కుకున్నారు.చెన్నై తిరువీకనగర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా నీలకంఠన్ (70) పోటీ చేస్తున్నారు. గత 2011 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు సేవ చేయాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆమె 68 ఏళ్ల జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని మొక్కుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా తాను పొందిన రూ.34.4 లక్షల జీతభత్యాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి తన మొక్కును వివరించారు. మీరు కోరినట్లుగా నే మొక్కులు చెల్లించుకోండి అని జయలలిత చెప్పారు. దీంతో నగరంలోని ప్రముఖ బంగారు నగల దుకాణంలో 68 కిలోలతో వెండి కవచానికి ఆర్డర్ ఇచ్చారు. అయితే వెండికవచం సిద్ధమయ్యేలోగా ఎన్నికలు రావడంతో మొక్కు తీర్చడాన్ని వాయిదా వేసుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత జయలలితకు చూపించి శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పిస్తానని నీలకంఠన్ చెప్పారు.


