breaking news
Master mahendran
-
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ చిత్రం వసుదేవ సుతం. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్ చూస్తే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మహేంద్రన్ హీరోగా పక్కం నంబర్ 143
మాస్టర్ మహేంద్రన్‌గా తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మహుళ ప్రాచుర్యం పొందిన నటుడు మహేంద్రన్ ఇప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.కాగా తాజాగా మహేంద్రన్ పక్కమ్ నంబర్ 143 అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.శ్రీలక్ష్మి నరసింహా సినీ స్టూడియోస్ పతాకంపై క్రిష్ణబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని ఏ.జగన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన వెల్లడిస్తూ కాలం మారుతున్నా కొందరు మనుషులు మాత్రం మారరన్నారు. వారి గుణగణాల్లోనూ మార్పు రాదన్నారు. అలాంటి ఒక క్రూర మనస్తత్వం గల యువకుడి ఒక యువతి ఎలా మంచి వాడిగా మార్చిందన్న విభిన్న కథాంశంతో తెరకెక్కించనున్న చిత్రం పక్కమ్ నంబర్ 143 అని తెలిపారు. చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. చిత్రానికి సంగీతాన్ని మధుకర్, చాయాగ్రహణం కర్ణ అందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.