మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్ | Master Mahendran Movie Vasudheva Sutham First Glimpse Released | Sakshi
Sakshi News home page

Vasudheva Sutham First Glimpse: మాస్టర్ మహేంద్రన్‌ 'వసుదేవసుతం'.. ఆసక్తిగా గ్లింప్స్

May 18 2025 9:30 PM | Updated on May 18 2025 9:30 PM

Master Mahendran Movie Vasudheva Sutham First Glimpse Released

మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ చిత్రం వసుదేవ సుతం. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్ చూస్తే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.  ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement