బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్ లైఫ్ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్‌లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
చేదు అనుభవం
రాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.
దారుణంగా..
కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అందుకే నా ఫస్ట్ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..
ఆయనే న్యాయ నిర్ణేత
సినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్ సర్జన్ అనే నాటకం వేశాను. మా టీమ్‌కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్‌లో దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్‌లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.
సినిమాలు
రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. మేడ్ ఇన్ హెవెన్, సేక్రెడ్ గేమ్స్, ఓకే కంప్యూటర్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్ అనే థ్రిల్లర్ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.
చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు


