‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది | Aadi Saikumar Injured Shambhala Movie Shooting Time | Sakshi
Sakshi News home page

‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది

Dec 18 2025 1:36 PM | Updated on Dec 18 2025 3:26 PM

Aadi Saikumar Injured Shambhala Movie Shooting Time

టాలీవుడ్‌ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్‌ వరల్డ్‌’ అనేది ఉపశీర్షిక. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే,  ఈ మూవీ షూటింగ్‌లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

శంబాల మూవీని విజువల్ వండర్‌గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌లతో మేకర్లు ఆడియెన్స్‌ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్‌ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.

ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్‌లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్‌ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.

‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్‌లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్‌లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement