breaking news
Shambala
-
ఇంట్రెస్టింగ్గా 'శంబాల' టీజర్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శంబాల'. సూపర్ నేచురల్ హారర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్చన అయ్యర్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు టీజర్‌ని విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న టీజర్.. అంచనాలు పెంచుతోంది.(ఇదీ చదవండి: బన్నీ-అట్లీ మూవీ క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే?)ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో శంబాల అనే ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఆది సాయి కుమార్ అదే పేరుతో సినిమాతో తీస్తున్నాడు. టీజర్ బట్టి చూస్తే.. అంతరిక్షం నుంచి ఓ ఉల్క లాంటి పదార్థం ఓ ఊరిలో పడుతుంది. అప్పటినుంచి ఆ ఊరిలో మనుషులు అందరూ వింతగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి చోటుకు హీరో వస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ గురించి ప్రకటించనున్నారు.ఈ సినిమాలో 'మొగలిరేకులు' ఫేమ్ ఇంద్రనీల్.. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడు. యుగంధర్ ముని దర్శకుడు కాగా.. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ జానర్ సినిమాలకు కాస్త ఆదరణ లభిస్తోంది. మరి 'శంబాల'.. ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తమిళ హీరో.. పోస్ట్ వైరల్) -
హారర్... థ్రిల్
ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక(Swasika)ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత అనే పాత్రలో స్వాసిక కనిపించనున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’. ఈ మూవీలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా సవాల్‌తో కూడుకున్న పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘తమ్ముడు’తో పాటు హీరో సూర్య 45వ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్వాసిక. -
హారర్ థ్రిల్లర్
‘శంబాల’ కోసం జియో సైంటిస్ట్‌గా మారారు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. అర్చనా అయ్యర్ హీరోయిన్ . యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా సోమవారం (డిసెంబరు 23) ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘శంబాల’ నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో ఈ మూవీ తీస్తున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన యుగంధర్ ముని ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్్స జిమ్మర్తో పని చేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు’’అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఈతకు దిగి ఒకరు.. రక్షించబోయి మరొకరు..
మోపిదేవి, న్యూస్‌లైన్ : ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలి తీసుకోగా, అతడిని రక్షించాలన్న ఆతృతలో ఓ యువకుడు నీట మునిగి చనిపోయాడు.. మోపిదేవి మండలం మక్తాలంకలో చెరువులో మునిగి ఇద్దరు మరణించిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృత్యువాత పడగా, మరో కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడు మరణించాడు. ఈ ఘటన రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలింది. ప్రాణాలు తీసిన సరదా.. మక్తాలంకకు చెందిన మిత్రులు శ్యాంబాబు, రాయన బాబి(10) సరదాగా గ్రామంలోని కరకట్ట పక్కనున్న చెరువులో ఆదివారం ఈతకు దిగారు. తొలుత గట్టు పక్కన ఆటలాడుకున్నారు. అనంతరం లోనికి వెళ్లి గోతిలో మునిగిపోయారు. ఇది గమనించిన మరో మిత్రుడు మురళి కేకలు వేయటంతో సమీపంలో ఉన్న దాసరి లక్ష్మీనారాయణ(19) చెరువులోకి దూకి తొలుత శ్యాంబాబును రక్షించాడు. అనంతరం బాబిని రక్షించే యత్నంలో అతడూ గోతిలో మునిగి చనిపోయాడు. కొడుకు.. భర్త... కొడుకు.. రాయన వెంకటేశ్వరమ్మ పెద్ద కుమారుడు ఐదేళ్ల క్రితం మరణించాడు. భర్త అంకిరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో రెండో కుమారుడు బాబిని ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఇతడు ఐదో తరగతి చదువుతున్నాడు. బాబి కూడా ఆకస్మికంగా మరణిం చడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వరుసగా పెద్ద కుమారుడు, భర్త, రెండో కొడుకు చనిపోవడంతో ఆమె ఒంటరిదయింది. రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు... దాసరి వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడిని గారాబంగా పెంచుకుంటున్నారు. లక్ష్మీనారాయణ గతంలో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. ఈ ఏడాది పాలిటెక్నిక్ చదివేందుకు సిద్ధపడ్డాడు. లక్ష్మీనారాయణకు ఈత రాదు. అయినప్పటికీ చెరువులో మునిగిన శ్యాంబాబును అందులోకి దిగి రక్షించాడు. బాబిని కూడా రక్షించే యత్నంలో గోతిలో మునిగి చనిపోయాడు. కుమార్తెల తర్వాత పుట్టిన లక్ష్మీనారాయణ ఆకస్మికంగా మరణించటంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెరువులో పొక్లెయిన్‌తో లోతుగా మట్టిని తవ్వడం వల్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు, అవనిగడ్డ సీఐ రమణమూర్తి, ఎస్సై శ్రీనివాస్ ఘటనాస్థలికి వచ్చి, ప్రమాద వివరాలను అడి గి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.