‘‘శంబాల’ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఇలాంటి జానర్ సినిమాలనే కోరుకుంటున్నారు. ఇలాంటి చిత్రాల్ని టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా కరెక్ట్‌గా తీస్తే ఎలాంటి ఇం పాక్ట్‌ను క్రియేట్ చేస్తాయో ఇది వరకే చూశాం. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అని హీరో నాని తెలి పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది.
ఈ మూవీ ట్రైలర్‌ని నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే ఇంగ్లిష్ సాంగ్ చాలా స్టైలిష్‌గా ఉంది.. అదిరిపోయింది. ఆది చాలా ఏళ్ల నుంచి నాకు తెలుసు. మంచి నటుడు, డ్యాన్సర్. మంచి నటుడికి ఓ మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో చె΄్పాల్సిన పని లేదు. ‘శంబాల’ పెద్ద హిట్ అవ్వాలి.. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని చె΄్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, యుగంధర్ ముని, రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి పాల్గొన్నారు.


