– అల్లు అరవింద్
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జోడీగా నటించిన సినిమా ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘శంబాల’ని ఎంజాయ్ చేశాను. కొంచెం ఆలస్యమైనా ఈ మూవీతో ఆది విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి తను దూసుకుపోవాలి’’ అని తెలిపారు.
‘‘నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదికి ‘శంబాల’తో హిట్ రావడం ఆనందంగా ఉంది’’ అని చె΄్పారు సాయికుమార్. ‘‘ఆదికి హిట్ వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ సినిమా తీస్తాను’’ అని పేర్కొన్నారు సందీప్ కిషన్ . ‘‘శంబాల’ సక్సెస్ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు ఆది సాయికుమార్. ‘‘మా సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు థ్యాంక్స్’’ అన్నారు మహీధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, యుగంధర్ ముని. ‘‘శంబాల’ విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని దర్శకులు బాబీ, వశిష్ట, నిర్మాతలు కోన వెంకట్, రాజేష్ దండా పేర్కొన్నారు.


