breaking news
Archana Iyer
-
ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
ఆది ఇకపై దూసుకుపోవాలి
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జోడీగా నటించిన సినిమా ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘శంబాల’ని ఎంజాయ్ చేశాను. కొంచెం ఆలస్యమైనా ఈ మూవీతో ఆది విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి తను దూసుకుపోవాలి’’ అని తెలిపారు. ‘‘నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదికి ‘శంబాల’తో హిట్ రావడం ఆనందంగా ఉంది’’ అని చె΄్పారు సాయికుమార్. ‘‘ఆదికి హిట్ వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ సినిమా తీస్తాను’’ అని పేర్కొన్నారు సందీప్ కిషన్ . ‘‘శంబాల’ సక్సెస్ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు ఆది సాయికుమార్. ‘‘మా సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు థ్యాంక్స్’’ అన్నారు మహీధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, యుగంధర్ ముని. ‘‘శంబాల’ విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని దర్శకులు బాబీ, వశిష్ట, నిర్మాతలు కోన వెంకట్, రాజేష్ దండా పేర్కొన్నారు. -
‘శంబల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
దేవిలాంటి పాత్రలు ఒక్కసారే వస్తాయి
‘‘శంబాల’ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ వైబ్ వస్తుంది. అన్ని రకాల భావోద్వేగాలను టచ్ చేస్తూ తీసిన ‘శంబాల’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్ అర్చనా అయ్యర్ చెప్పారు. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వం వహించిన చిత్రం ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అర్చనా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగమ్మాయినే. మాది చిత్తూరు జిల్లా. అయితే ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరులోనే జరిగింది. ‘శంబాల’లో నాది కేవలం స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. నా కెరీర్ ఆరంభంలోనే ‘శంబాల’ లాంటి చిత్రం, ఈ చిత్రంలో దేవిలాంటి పాత్ర చేయడం నా లక్‌గా భావిస్తున్నాను. ఇలాంటి పాత్రలు కెరీర్లో మళ్లీ మళ్లీ రావు. ఒక్కసారే వస్తాయి. ‘శంబాల’ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది దర్శకులు ఫోన్ చేసి, నన్ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ మూవీ చేస్తున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్లు చేస్తాను. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘శంబాల’ లో ఏం జరిగింది? దేవి సమస్య ఏంటి?
వెనకాల గుడి, చుట్టూ పక్షులు, ఎర్రబారిన కళ్లు, విషణ్ణ వదనంతో ‘ఈ అమ్మాయికి ఏమైందబ్బా’ అనేలా కనిపించింది దేవి. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? అనేది ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంలో చూడాల్సిందే. ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. ఈ చిత్రంలో దేవి అనే ముఖ్య పాత్రలో నటిస్తున్న అర్చనా అయ్యర్ లుక్‌ని విడుదల చేశారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. ‘‘ఈ చిత్రంలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్ర చేస్తున్నారు. సరికొత్త కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది.


