‘శంబాల’ లో ఏం జరిగింది? దేవి సమస్య ఏంటి? | Introducing Archana Iyer In A Majestic Look As Devi In Shambhala Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

‘శంబాల’ లో ఏం జరిగింది? దేవి సమస్య ఏంటి?

Feb 15 2025 7:57 AM | Updated on Feb 15 2025 8:38 AM

Introducing Archana Iyer In A Majestic Look As Devi In Shambhala Movie

వెనకాల గుడి, చుట్టూ పక్షులు, ఎర్రబారిన కళ్లు, విషణ్ణ వదనంతో ‘ఈ అమ్మాయికి ఏమైందబ్బా’ అనేలా కనిపించింది దేవి. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? అనేది ‘శంబాల: ఎ మిస్టికల్‌ వరల్డ్‌’ చిత్రంలో చూడాల్సిందే. ఆది సాయికుమార్‌ హీరోగా రూపొందుతున్న సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘శంబాల’. ఈ చిత్రంలో దేవి అనే ముఖ్య పాత్రలో నటిస్తున్న అర్చనా అయ్యర్‌ లుక్‌ని విడుదల చేశారు. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, మహిధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. 

 ‘‘ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ జియో సైంటిస్ట్‌ పాత్ర చేస్తున్నారు. సరికొత్త కథ, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement