నటుడు సాయి కుమార్ ఇంట వారసుడు జన్మించాడు. ఆది సాయికుమార్, అరుణ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ సోషల్‌మీడియాలో సన్నిహితులు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారికి ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. అయితే, పాప పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లో వారసుడు జన్మించాడు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది. శంబాల సినిమా సక్సెస్‌తో పాటు కొత్త ఏడాదిలో వారసుడి రాకతో సాయికుమార్ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారట.
2014లో అరుణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ఆది పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి అయ్యాడు. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని ఆది ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
శంబాల కలెక్షన్స్..
చాలా ఏళ్ల తర్వాత శంబాల మూవీతో ఆది సాయికుమారు భారీ విజయాన్ని అందుకున్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆది కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా శంబాల రికార్డ్ క్రియేట్ చేసింది.


