టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. వీరిద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు. ఆ పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరిపై రూమర్స్ వస్తున్నా పట్టించుకోలేదు. చివరికీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ రూమర్స్‌ను నిజం చేశారు.
తాజాగా ఈ నూతన జంట న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతతో కలిసి ఆమె భర్త రాజ్ నిడిమోరు కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వీడియో సామ్ నవ్వుతూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్, అభిమానులు సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా..సమంత- రాజ్ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Unplanned moments will be one of those nights where boundaries quietly disappeared ❤️😍
Samantha with her husband and frnds at a celebration 😍 Happy New Year🔥#Samantha pic.twitter.com/ykKy16Gre3— Dhruv Arjun (@Dhruv_Arjunan) January 1, 2026


