మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్ | chiranjeevi Mana Shankara VaraPrasad Garu trailer release date | Sakshi
Sakshi News home page

Mana Shankara VaraPrasad Garu: మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్

Jan 2 2026 2:50 PM | Updated on Jan 2 2026 3:39 PM

chiranjeevi Mana Shankara VaraPrasad Garu trailer release date

మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్‌ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది  రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు.

ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్‌ గారు మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్‌ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement