వెంకటేశ్ పట్నాలా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆల్పా రిడంప్షన్. తానే హీరోగా నటిస్తూ పట్నాలా ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మించారు. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 3న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీ కథేంటో అర్థమవుతోంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. మనిషిలోని భావోద్వేగాలను, ప్రాయశ్చిత్తాన్ని చూపే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు భువన్, మార్టిన్ సంగీతమందించారు.


