ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్‌పై సాయి శ్రీమంత్, శబరీష్ బోయెళ్ల నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ని తనికెళ్ల భరణి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కిషోర్ శ్రీకృష్ణ తెరకెక్కించిన‘అసుర సంహారం’ సినిమా బాగా వచ్చింది.
ఇందులో పల్లెటూరి డిటెక్టివ్ పాత్ర పోషించాను’’ అని చె΄్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో సినిమాని రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కిషోర్ శ్రీకృష్ణ తెలిపారు. ‘‘విలేజ్ క్రైమ్ డ్రామాగా రూ΄÷ందిన మా సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి’’ అని ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా అన్నారు.


