పెద్ది నటుడి బర్త్‌ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ట్వీట్ | Shivaraj Kumar Birthday Gift To Peddi Director Buchi Babu | Sakshi
Sakshi News home page

Buchi Babu: పెద్ది నటుడి బర్త్‌ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ట్వీట్

Feb 17 2026 8:02 PM | Updated on Feb 17 2026 8:10 PM

Shivaraj Kumar Birthday Gift To Peddi Director Buchi Babu

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్‌ విషెస్ తెలిపారు. దర్శకుడితో షూట్‌లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా పెద్ది మూవీ నటుడు శివరాజ్‌కుమార్‌ డైరెక్టర్‌ బుచ్చికి బర్త్‌ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు వెల్లడించారు. ట్విటర్ వేదికగా శివరాజ్‌కుమార్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. థ్యాంక్‌ యూ సో మచ్‌ ఫర్ లవ్‌లీ గిఫ్ట్ అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement