హిట్టు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాడు హీరో ఆది సాయికుమార్. తన కంటే ఎక్కువగా అతడి తండ్రి, నటుడు సాయికుమార్ నిరీక్షిస్తున్నాడు. వీరి ఎదురుచూపులకు తెరదించుతూ 2025 ముగింపులో భారీ విజయం సొంతమైంది. శంబాల సినిమాతో ఆది హిట్టు కొట్టాడు. తండ్రి సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సమయంలో ఈ సక్సెస్ రావడం మరింత విశేషం!
వారం రోజుల్లోనే అన్ని కోట్లా?
శంబాల విషయానికి వస్తే ఆది హీరోగా, అర్చన్ అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీ క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. శంబాల సక్సెస్‌తో ఆదికి మంచి బూస్ట్ దొరికినట్లయింది!
#Shambhala pic.twitter.com/Bmc71qEtbb
— Aadi Saikumar (@iamaadisaikumar) January 2, 2026


