కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్‌కు 'లోక' ఆఫర్‌! | Was Parvathy Thiruvothu First Choice in Lokah Movie, Here is the Answer | Sakshi
Sakshi News home page

'లోక' ఫస్ట్‌ ఛాయిస్‌ మీరేనా? పార్వతి ఆన్సరిదే!

Jan 2 2026 4:52 PM | Updated on Jan 2 2026 5:07 PM

Was Parvathy Thiruvothu First Choice in Lokah Movie, Here is the Answer

మలయాళ ఇండస్ట్రీని షేక్‌ చేసిన చిత్రం లోక. కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్‌ ఉమెన్‌ చిత్రం లోక. డామినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొత్త లోక: చాప్టర్‌ 1 పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాతగా వ్యవహరించాడు. 2025 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్‌ కంటే ముందు పార్వతి తిరువోతును సంప్రదించినట్లు ఓ రూమర్‌ ఉంది.

హీరోయిన్‌ అసహనం
తాజాగా ఈ రూమర్‌పై పార్వతి సీరియస్‌ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతమదృష్ట్య కుట్టకర్‌. ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్‌ వచ్చిందా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికామె స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం. మీరు ఇలాంటివి చాలా వింటుంటారు. మీకు నచ్చింది వినుకోండి అని బదులిచ్చింది.

చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలిస్తా: నటికి బంపరాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement