‘‘సినిమాలోని కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న మా ‘శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపరచదు. మా చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రలు చేస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది.
ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. ఈ ట్రైలర్ చూసి, రానాగారు మెచ్చుకుని, తన వంతుగా సాయం చేస్తానని చెప్పారు. కొంతమంది హిందీ రిలీజ్ గురించి అడుగుతున్నారు.
ఇంకా మాకు సపోర్ట్‌గా నిలిచిన దుల్కర్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం, సహకరించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసాద్ అన్నలకు ధన్యవాదాలు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది’’ అని యుగంధర్ ముని చెప్పారు.


