ది రాజాసాబ్‌ మూవీపై రూమర్స్.. నిర్మాత ట్వీట్‌ వైరల్ | The Raja Saab Movie Producer TG Vishwa prasad Clarity on Rumours | Sakshi
Sakshi News home page

The Raja Saab Movie: ది రాజాసాబ్‌ మూవీపై రూమర్స్.. స్పందించిన నిర్మాత

Dec 21 2025 9:36 AM | Updated on Dec 21 2025 10:54 AM

The Raja Saab Movie Producer TG Vishwa prasad Clarity on Rumours

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆ‍సక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌ను మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా.. సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. రెబల్ స్టార్‌ మూవీ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెబల్ స్టార్‌ మూవీ కావడంతో టాలీవుడ్‌లో అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్‌ డీల్స్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్‌ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీ డీల్‌తో పాటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌ అంచనాలు అందుకోలేకపోయిందని కొందరు  కామెంట్స్ చేస్తున్నారు. ఈ రూమర్స్‌పై ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది

మా అతిపెద్ద సినిమా అయిన ది రాజాసాబ్‌ అంతర్గత లెక్కల గురించి బయటికి చెప్పలేమని నిర్మాత వెల్లడించారు. మా సినిమాకు థియేటర్లలో రిలీజ్ తర్వాత వచ్చే లెక్కలను అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపారు. సినిమా రంగం అనేది దశలవారీగా మారుతూ ఉంటుందన్నారు.  ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో సాధారణంగా  సర్దుబాట్లు జరుగుతుంటాయని అన్నారు. థియేటర్లలో మాత్రమే అసలైన నంబర్స్‌ వస్తాయని వెల్లడించారు. అయినప్పటికీ కూడా మా సినిమా ఈ రోజు  అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను సాధించిందని విశ్వప్రసాద్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ది రాజాసాబ్‌కు పోలికలు అనవసరమని రూమర్స్‌ను కొట్టిపారేశారు నిర్మాత.  కాగా.. ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement