ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్ | Nora Fatehi responds on after drunk driver hits her car in Mumbai | Sakshi
Sakshi News home page

Nora Fatehi: ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్

Dec 21 2025 10:58 AM | Updated on Dec 21 2025 11:16 AM

Nora Fatehi responds on after drunk driver hits her car in Mumbai

బాలీవుడ్ బ్యూటీ, ఐటమ్ సాంగ్స్‌ ఫేమ్ నోరా ఫతేహీ కారు ప్రమాదానికి గురైంది. ముంబయిలో ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ‍మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నోరా కారు పూర్తిగా దెబ్బతినగా.. హీరోయిన్‌కు స్వల్పంగా గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో నోరా ఫతేహీ  తలకు దెబ్బ తగలడంతో కాస్తా మతిభ్రమించినట్లు తెలుస్తోంది. అయితే వెంటేనే ఆస్పత్రికి వెళ్లడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే సన్‌బర్న్ సంగీత కచేరీ- 2025 ఈవెంట్‌కు హాజరైన ప్రదర్శనలో పాల్గొన్నారు.

తాజాగా తన ఆరోగ్యంపై నోరా ఫతేహీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. నిన్న కారు ప్రమాదంతో చాలా భయపడ్డానని పేర్కొంది. తాగిన మత్తులో కారు నడిపిన వ్యక్తి తప్పిదం వల్లే తన కారు ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ఇలాంటి వాళ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పుందని ఆవేదన వ్యక్తం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను కోరింది.

కాగా.. ప్రస్తుతం నోరా ఫతేహీ కాంచన 4, కేడీ: ది డెవిల్’ వంటి భారీ సౌత్ ప్రాజెక్ట్స్‌ల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ది రాయల్స్ అనే వెబ్ సిరీస్‌ కూడా చేస్తోంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement