– రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి
‘‘శంబాల’ సినిమాకి ముందు ఆదితో వేరే కథ అనుకున్నాం. ఇంతలో ‘శంబాల’ కథ రావడంతో ఈ కథతోనే సినిమా చేద్దాం అనుకున్నాం. యుగంధర్ ముని చెప్పిన ఈ కథ అంత బాగా నచ్చింది. డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, సినిమా ఆరంభించాం’’ అని నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి తెలిపారు.
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీతో మాకు అనుబంధం ఉంది. పెద్ద సినిమాల వీడియో డీవీడీస్ హక్కులు మా వద్ద ఉండేవి. అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌గా పని చేశాం. నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రం. ఇందులో హారర్‌తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ ఉంటాయి.
‘కల్కి 2898 ఏడీ’ వచ్చిన తర్వాత ‘శంబాల’ (కల్కిలో శంబాల ప్రపంచం ఉంటుంది) గురించి అందరికీ తెలిసింది. అయితే అంతకు ముందే మేం ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశాం. కథపై నమ్మకంతో బడ్జెట్ ఎక్కువైనా రాజీ పడలేదు. మా పెట్టుబడిలో 80 శాతం వరకు బిజినెస్‌తో సేఫ్ జోన్‌లోకి వచ్చాం.. ఆది, అర్చనా అయ్యర్‌తో పాటు సినిమాలో అన్ని పాత్రలకి ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద ప్లస్. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో హిందీలో విడుదల చేస్తాం. మా తర్వాతి సినిమాల కోసం కొన్ని కథలు వింటున్నాం. డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాం’’ అని చెప్పారు.


