ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమా 'శంబాల'. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం.. రాబోయే శుక్రవారం (డిసెంబరు 25) థియేటర్లలోకి రానుంది. యగంధర్ ముని దర్శకత్వం వహించగా.. అర్చన అయ్యర్, స్వసిక తదితరులు కీలక పాత్రలు చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఓ ఎమోషనల్ పాటని విడుదల చేశారు.
'శంబాల' స్టోరీని కాస్త రివీల్ చేసేలా హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం వివరించేలా ఇది సాగుతోంది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే 'శంబాల' మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కుల్ని అమ్మేశారు కూడా.


