breaking news
Abhishek Pathak
-
దృశ్యం-2 దర్శకుడిని పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్
-
డైరెక్టర్‌ను పెళ్లాడిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా-సిద్దార్థ్ జంటలు ఒక్కటవ్వగా.. తాజాగా మరో ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్ అభిషేక్ పాఠక్, కుదా హఫీజ్ హీరోయిన్ శివలీకా ఒబెరాయ్ పెళ్లి గురువారం అత్యంత వైభవంగా జరిగింది. గోవాలో జరిగిన వెడ్డింగ్‌కు స్నేహితులు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. గతంలోనే టర్కీలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది బాలీవుడ్ జంట.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శివాలికా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. (ఇది చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) శివాలికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీరు ప్రేమను కనిపెట్టలేదు. ప్రేమే మిమ్మల్ని కనిపెట్టినట్లుంది. మా ఇద్దరి బంధం ఆకాశంలో నక్షత్రాల మధ్య నిర్ణయించినట్లుంది. నా జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేను. మా ప్రియమైన వారితో వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఇది మా జీవితంలో అత్యంత అద్భుత క్షణం. మా హృదయాలు ప్రేమ, జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం.' అని అన్నారు. పెళ్లి గోవాలో 2 రోజుల పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, అమన్ దేవగన్, కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భరుచ్చా, విద్యుత్ జమ్వాల్, సన్నీ సింగ్, భూషణ్ కుమార్, దర్శకుడు లవ్ రంజన్, ఇషితా రాజ్ శర్మ హాజరయ్యారు. కాగా శివలీకా ఒబెరాయ్ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది.ఇటీవలే 'దృశ్యం 2'తో అభిషేక్ పాఠక్ సూపర్ హిట్ సాధించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ నటించారు. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi (@shivaleekaoberoi) -
హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి పెళ్లిపీటలెక్కగా ఓ వారం రోజుల్లో కియారా అద్వానీ కూడా పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కూడా పెళ్లిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్ అభిషేక్ పాఠక్, కుదా హఫీజ్ హీరోయిన్ శివలేఖ ఒబెరాయ్ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారట! ఇదే విషయాన్ని నటి హింటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఆకాశంలో అన్ని నక్షత్రాలుండగా, సముద్రం ఒడ్డున ఇన్ని నక్షత్ర చేపలుండగా అతడు మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా నావైపే చూస్తున్నాడు' అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో అభిషేక్ ముఖం కనిపించకుండా బ్లర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అభిషేక్ పాఠక్- శివలేఖ గోవాలో పెళ్లి చేసుకోనున్నారంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా శివలేఖ ఒబెరాయ్ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi (@shivaleekaoberoi) చదవండి: హీరోయిన్‌కు అభిమాని పూజలు