మీకు సిగ్గుగా అనిపించడం లేదా: సన్నీ డియోల్‌ | Actor Sunny deol Comment On Media channels | Sakshi
Sakshi News home page

మీకు సిగ్గుగా అనిపించడం లేదా: సన్నీ డియోల్‌

Nov 14 2025 7:56 AM | Updated on Nov 14 2025 7:56 AM

Actor Sunny deol Comment On Media channels

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. కొంతకాలంగా ఆయన  శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన మరణించారంటూ బాలీవుడ్‌ మీడియాలో మొదట కథనాలు ఇచ్చింది. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే, ధర్మేంద్రకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. అయితే, మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు సన్నీ డియోల్‌ ఫైర్‌ అయ్యారు.

ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర ఇంటికి చేరుకుంటున్న సమయంలో మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంది. దీంతో సన్నీ డియోల్‌ ఫైర్‌ అయ్యాడు. తమ కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వాలంటూ మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేశాడు. 'మీ అందరికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా..' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ధర్మేంద్రకు  ఆయన నివాసంలోనే వైద్యం అందిస్తున్నారని వైద్యులు తెలిపారు. డిసెంబరు 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement