కొత్త ఏడాదికి ఓటీటీ సినిమాల వెల్‌కమ్‌.. ఏకంగా 19 చిత్రాలు స్ట్రీమింగ్..! | This new year Ott Movies Release List Goes Viral | Sakshi
Sakshi News home page

Ott Release Movies: కొత్త ఏడాదిలో ఓటీటీ చిత్రాలు.. రెండు రోజుల్లోనే 19 సినిమాలు..!

Jan 1 2026 7:13 PM | Updated on Jan 1 2026 7:42 PM

This new year Ott Movies Release List Goes Viral

చూస్తుండగానే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోయింది. కొత్త ఏడాదికి ఎన్నో ఆశలతో స్వాగతం పలికారు సినీ ప్రేక్షకులు. కొత్త సంవత్సరంలో తొలిరోజే టాలీవుడ్ నుంచి సైక్ సిద్ధార్థ్, వనవీర లాంటి చిత్రాలు ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేశాయి. నూతన ఏడాది తొలివారంలో పెద్ద సినిమాల హవా లేకపోయినా.. చిన్న సినిమాలు అలరిస్తున్నాయి.

ఇక థియేటర్ల సంగతి పక్కన పెడితే.. కొత్త ఏడాదిలో ఓటీటీల్లోనూ సినిమాల సందడి నెలకొంది. ఈ శుక్రవారం తెలుగు సినిమా బ్యూటీ ఓటీటీలో సందడి చేయనుంది.  దీంతో పాటు బాలీవుడ్ నుంచి హాక్, కోలీవుడ్ నుంచి ఎల్బీడబ్ల్యూ, కుంకీ-2 లాంటి సినిమాలు అలరించనున్నాయి. కొత్త ఏడాదిలో రెండు రోజుల్లోనే దాదాపు 17 చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. న్యూ ఇయర్‌లో మీకు నచ్చిన సినిమాలు ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి.  
నెట్‌ఫ్లిక్స్

రన్ అవే(హాలీవుడ్ మూవీ)- జనవరి 01
మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్‌- జనవరి 01
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-5(ఫైనల్ ఎపిసోడ్)- జనవరి 01
లవ్ ఫ్రమ్ 9 టు 5(హాలీవుడ్ సిరీస్)- జనవరి 01
టైమ్ ఫ్లైస్‌(హాలీవుడ్ సినిమా)- జనవరి 01

ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
హాక్(హిందీ సినిమా)- జనవరి 02
ఆఫ్టర్‌ ది క్వేక్(జపనీస్ సినిమా)-జనవరి 02
ఫిజికల్.. వెల్‌కమ్‌ టూ మంగోలియా(రియాలిటీ షో)-జనవరి 02
ల్యాండ్ ఆఫ్ సిన్(క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)-జనవరి 02
యువర్ టర్న్ టూ కిల్(జపనీస్‌ మూవీ)-జనవరి 02

జియో హాట్‌స్టార్

ఎల్బీడబ్ల్యూ(తమిళ మూవీ)- జనవరి 01

అమెజాన్ ప్రైమ్

   సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02
   ఫాలో మై వాయిస్(స్పానిష్ మూవీ)-జనవరి 02
   డ్రకులా ఎ లవ్ టేల్(హాలీవుడ్ మూవీ)-జనవరి 02
   కుంకీ-2(తమిళ మూవీ)- జనవరి 03
జీ5
బ్యూటీ (తెలుగు సినిమా)- జనవరి 02
బుక్ మై షో

ది స్మాషింగ్ మెషీన్(హాలీవుడ్ మూవీ)-జనవరి 02

సన్ నెక్స్ట్

   ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement