ధర్మేంద్ర సోదరుడు మృతి | Dharmendra's brother Ajit Singh Deol no more | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర సోదరుడు మృతి

Oct 24 2015 11:09 AM | Updated on Apr 3 2019 6:34 PM

ధర్మేంద్ర సోదరుడు మృతి - Sakshi

ధర్మేంద్ర సోదరుడు మృతి

బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ తండ్రి, ప్రముఖ నటుడు ధర్మేంద్ర సోదరుడు అజిత్ సింగ్ డియోల్ శుక్రవారం మృతి చెందారు.

ముంబై : బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ తండ్రి, ప్రముఖ నటుడు ధర్మేంద్ర సోదరుడు.. అజిత్ సింగ్ డియోల్ శుక్రవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అజిత్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అజిత్ తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం ముంబై నగర శివారులోని పవన్ హన్స్లోని అంత్యక్రియలు జరిపినట్లు చెప్పారు. అజిత్ నటుడు, దర్శకుడిగా పలు పంజాబీ, హిందీ చిత్రాలు తీశారు. అలాగే పలు చిత్రాలలో ఆయన నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement