రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, క్రీడలు తదితర రంగాల నుంచి మొత్తంగా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలానే 13 మందికి పద్మభూషణ్ వరించాయి. ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారులు దక్కాయి.
హిందీ చిత్రసీమకు విశేష సేవలందించిన దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టిని పద్మభూషణ్ వరించింది. ప్రముఖ నటుడు మాధవన్‌ని పద్మ శ్రీ దక్కించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్.. పద్మశ్రీలుగా ఎంపికయ్యారు.


