పంజాబ్‌లోని మారుమూల గ్రామం నుంచి ముంబై నగరానికి చేరుకుని సినీ రంగంలో 'స్టార్'గా ఎదిగిన ఘనత ధర్మేంద్ర సొంతం. ఆరు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగిన ఆయన 300కు పైగానే సినిమాలు చేశారు. దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండానే ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ‘రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా’ ప్రశంసలు పొంది, ‘హీ మ్యాన్’గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ధర్మేంద్రకు 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను ‘పద్మ భూషణ్’ పురస్కారంతో సత్కరించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను తాజాగా ‘పద్మ విభూషణ్’ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన సతీమణి హేమ మాలిని ఆనందం వ్యక్తంచేశారు.
ధర్మేంద్రకు 'పద్మ విభూషణ్' అవార్డ్ ఇవ్వడంతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని హేమ మాలిని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డ్‌కు ధర్మేంద్ర అర్హుడు. ఆయన అభిమానులు ఇప్పుడు చాలా ఆనందంతో ఉన్నారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డ్‌ను ధర్మేంద్ర అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ, తీసుకోవడానికి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ధర్మేంద్ర కెరీర్‌లో జీవిత సాఫల్య పురస్కారాలు మాత్రమే దక్కాయి. ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు ఒక్క ఫిల్మ్‌ఫేర్ కూడా రాలేదు. కానీ, ఏకంగా ‘పద్మ భూషణ్’ దక్కడం చాలా గౌరంగా ఉంది.' అని ఆమె అన్నారు.


