ది బర్నింగ్ ట్రైన్.... | Sakshi
Sakshi News home page

ది బర్నింగ్ ట్రైన్....

Published Sun, Sep 27 2015 11:11 PM

ది బర్నింగ్ ట్రైన్....

బి.ఆర్.చోప్రా కొడుకు రవిచోప్రా భారీగా తీసిన సినిమా ఇది. ఇంత భారీగా తీయడం వెనుక ‘షోలే’ ఘన విజయం ఉంది. 1975లో విడుదలైన షోలే సృష్టించిన కలెక్షన్లు అసామాన్యమైనవి. దీంతో రవి చోప్రా కూడా చాలా ఖర్చు పెట్టి భారీ హంగామాతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుని ఈ కథ తీశాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతున్న కొత్త రైలు ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’ అగ్ని ప్రమాదానికి గురైతే అందరూ కలిసి దానిని ఎలా ఆపారు, ప్రయాణికులను ఎలా రక్షించారు అనేది కథ. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, పర్విన్‌బాబీ, హేమమాలిని, నీతూ సింగ్ ఇంత మంది హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు.

డానీ విలన్. 1980 మార్చిలో విడుదలైంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చాలా తొందరగా కలెక్షన్లు పడిపోయాయి. షోలేలో ఉన్న కథ, మానవోద్వేగాలు, విలన్ ఇందులో అంత గట్టిగా లేకపోవడం కథ రైలు వరకే కుదించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. కాని టెక్నికల్‌గా సినిమా మంచి ప్రమాణాలు అందుకుంది. ఇందులో రఫీ ఖవాలి (సాహిర్ రచన) ‘పల్ దో పల్ కా సాథ్ హమారా... పల్ దో పల్ కే యారానే హై’ పెద్ద హిట్. ఈ సినిమాకు సంబంధించి ఈ పాటే మిగిలింది.
 

Advertisement
Advertisement