సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం! | Sunny Deol and Bobby Deol may skip Ahana Deol's wedding | Sakshi
Sakshi News home page

సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!

Feb 2 2014 3:18 PM | Updated on Sep 2 2017 3:17 AM

సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!

సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!

సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్జీల సంతానం సన్నీ, బాబీ డియోల్ కాగా, ధర్మేంద్ర రెండవ భార్య సినీనటి హేమమాలినిలకు ఇషా, అహనా డియోలు ఇద్దరు కూతుళ్లు.
 
ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న కారణంగా 2012 లో జరిగిన ఇషా డియోల్ వివాహానికి హాజరుకాలేదు. అయితే అహనా పెళ్లికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని సన్నిహితులు వెల్లడించారు. ఇషా, అహనా, బాబీ, సన్నీ డియోల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. 
 
అహనా పెళ్లి కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన మెహందీ వేడుకలో ఇషా డియోల్ జారి కింద పడిపోవడంతో ఆమె భుజానికి స్వల్పంగా గాయమైంది. చేతికి ఉన్న కట్టుతోనే వివాహ వేడుకల్లో ఇషా హడావిడి చేస్తోంది. 
 
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరా తో అహనా వివాహం ఆదివారం సాయంత్రం ముంబైలోని ఐటీసీ మరాఠాలో జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ తోపాటు పలువురు తారలు, రాజకీయ నేతల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, రాజ్ థాకరేలు హాజరుకానున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement