ఒకప్పటి హీరో, బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర చనిపోయారని చెప్పి రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇవి వచ్చిన కాసేపటికే ఈయన భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్.. వీటిని ఖండించారు. ధరేంద్ర బ్రతికే ఉన్నారని, ఇలాంటి పుకార్లు సృష్టించడం సరికాదని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చారు.
(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)
ఇప్పుడు ధర్మేంద్రకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మంచంపై కదల్లేని స్థితిలో ఆయన కనిపించారు. ఎదురుగా కొడుకు బాబీ డియోల్ బాధపడుతూ కనిపించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికి వచ్చేసినప్పటికీ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈయన త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు, బాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన)
The Full Video From Dharmendra ji
His discharge from the Hospital
But health is not Well
Please Pray For Dharmendra ji 🙏 #DharmendraDeol #dharmendra pic.twitter.com/D7Z56vrbVo— Jolly Christian (@Jolly7294) November 13, 2025


