ఈ ఏడాది 'కూలీ'తో ప్రేక్షకుల్ని పలకరించిన రజనీకాంత్ నుంచి వారం క్రితం కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు సుందర్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుని హీరో కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఇప్పడు అకస్మాత్తుగా ఈ మూవీ నుంచి సుందర్ తప్పుకొన్నారు. ఈ విషయమై ఇప్పుడు అధికారికంగా నోట్ కూడా రిలీజ్ చేశారు.
'అనుకోని పరిస్థితుల కారణంగా #తలైవర్173 నుంచి తప్పుకొంటున్నాను. అయినా సరే రజనీకాంత్, కమల్ హాసన్‌లతో అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి' అని సుందర్.సి తన నోట్‌లో రాసుకొచ్చారు. కానీ ఎందుకు బయటకొచ్చేయాల్సి వచ్చింది? ఏమైంది? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)

ఇకపోతే రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అనగానే చాలామంది కలిసి నటిస్తారని అనుకున్నారు. కానీ రజనీ హీరోగా, కమల్ నిర్మాత అనేసరికి కాస్త సంబరపడ్డారు. కానీ దర్శకుడిగా సుందర్ అనేసరికి చాలామంది అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. దీనికి కారణముంది. గతంలో రజనీకాంత్‌కి 'అరుణాచలం' లాంటి హిట్ చిత్రాన్ని సుందర్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ టైంలో అయితే దెయ్యాల సినిమాలు తీస్తున్నాడు. వీటికి డబ్బులొస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.
ఇలాంటి దర్శకుడిగా రజనీకాంత్-కమల్ హాసన్.. అసలు ఎలా అవకాశమిచ్చారా అని.. అనౌన్స్‌మెంట్ వచ్చిన టైంలోనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడు సుందర్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, ఈయన స్థానంలోకి వచ్చే కొత్త దర్శకుడు ఎవరా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే సుందర్ నోట్‌ని, ఇతడి భార్య, నటి ఖుష్బూ తొలుత సోషల్ మీడియాలో పంచుకుంది. మరి ఏమైందో ఏమో గానీ వెంటనే డిలీట్ చేసింది.
(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!)


