ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రభాస్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్‌కి మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు మరింత సంతోషపడిపోయేలా నిధి అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
'రాజాసాబ్'లో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా '#ఆస్క్ నిధి' పేరుతో ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించింది. మిగతా ప్రశ్నలు, సమాధానాలు ఏమో గానీ ఓ ఆన్సర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అని అడగ్గా.. హీరోలుగా ప్రభాస్-పవన్ కల్యాణ్ ఉంటారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా.. హీరోయిన్గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ చేసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిధి అగర్వాల్‌కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయిగా అని మాట్లాడుకుంటున్నారు. నిజ జీవితంలో ఈ మల్టీస్టారర్ సెట్ అవుతుందా అంటే సందేహమే. ప్రభాస్ ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ. పవన్ మరోవైపు రాజకీయాలతో బిజీ. కాబట్టి నిధి కల కలాలానే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు.
'రాజాసాబ్' సినిమాలో నిధి అగర్వాల్ బెస్సీ అనే పాత్ర చేసింది. ఇందులో ఈమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని నిధి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ 'రాజాసాబ్'పై పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం నిధికి రాబోయే రోజుల్లో తెలుగులో అవకాశాలు కష్టమే?
PK sir
PRABHAS sir
NIDHHI me
SRV #AskNidhhi #TheRajaSaab https://t.co/CG1GzbHyEV— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025


