ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10వ తేదీ రాత్రి జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇది ఉగ్రచర్య అని కేంద్రం ప్రకటించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన నుంచి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ టీమ్ కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)
ఈనెల 15, 16 తేదీల్లో పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకుగానూ 'పెద్ది' టీమ్ అనుమతి తీసుకుందట. కానీ ఇప్పుడిలా జరగడంతో మరో ఆలోచన లేకుండా చిత్రీకరణ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ షూటింగ్ చేయడానికి కొన్నిరోజుల ముందే ఇలా జరగడంతో టీమ్ అంతా షాక్‌కి గురవుతున్నారట. రష్మిక కొత్త సినిమా షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇంకొన్నిరోజుల పాటు ఎర్రకోట ప్రాంతంలో ఎలాంటి షూటింగ్ ఉండే అవకాశం లేదు.
'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ మధ్యే 'చికిరి.. చికిరి' అనే పాటని రిలీజ్ చేశారు. అదెంత వైరల్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు.
(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)


