ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్ | Shriya Saran Stuns in Tamil Item Song ‘Kanakam’, Proves Glamour Has No Age | Sakshi
Sakshi News home page

Shriya Saran: 43 ఏళ్ల వయసులోనూ శ్రియ ఐటమ్ సాంగ్

Nov 13 2025 11:50 AM | Updated on Nov 13 2025 11:59 AM

Shriya Saran Latest Item Song Kanakam Details

సాధారణంగా వయసు పెరిగిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. చాలామంది విషయంలో ఇలా జరిగింది కూడా. కానీ కొందరు మాత్రం పెద్దవాళ్లు అవుతున్నా గ్లామర్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకు అయితే 50 ఏళ్లు దాటిపోయాయి. కానీ మొన్నీమధ్యే వచ్చిన 'థామా'లో ఐటమ్ సాంగ్ చేసింది.

(ఇదీ చదవండి: ‘స్పిరిట్’లో చిరు, డాన్‌ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా)

అసలు విషయానికొస్తే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సరసన నటించిన శ్రియ.. 2018లో ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత ఈమెకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతానికైతే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. రీసెంట్ టైంలో అయితే హిట్ మూవీ 'మిరాయ్'లో తల్లి పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఓ తమిళ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఆశ్చర్యపరిచింది.

'నాన్ వయలెన్స్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో 'కనకం' అంటూ సాగే ఐటమ్ పాటలో శ్రియ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఈ ఏడాది రిలీజైన సూర్య 'రెట్రో'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది గానీ ఎందుకనో అది పెద్దగా వైరల్ కాలేదు. ఇప్పుడొచ్చిన పాట మాత్రం శ్రియ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ ఈ రేంజ్ అందం మెంటైన్ చేస్తోందని నెటిజన్లు, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement