సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘స్పిరిట్’. అయితే ఇటీవల స్పిరిట్ గురించి వస్తున్న రూమర్స్‌పై సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాజాగా ‘జిగ్రీస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్‌లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
సందీప్ వంగా మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’లో నటిస్తున్నారన్న వార్తలు నిజం కాదు. మా ఇద్దరి మద్య అలాంటి చర్చలు జరగలేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే” అని తెలిపారు. కాగా “ఎప్పుడైనా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అది తప్పకుండా సోలో ఫిలిం రూపంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఏ జానర్‌లో, ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను” అని అన్నాడు.
మరోవైపు సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ కూడా ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా సందీప్ స్పందించాడు. అది కూడా రూమర్ మాత్రమే అని స్పష్టం చేశాడు.


