మెగా హీరో రామ్ చరణ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కనిపించాడు. వీళ్లకు తోడుగా 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కూడా సందడి చేశాడు. వీళ్లంతా కలిసి చిల్ అవుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు ఎక్కడ ఎప్పుడు కలిశారు?
(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం జరిగాయి. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరగ్గా.. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కనిపించాడు. క్రికెటర్ ధోనీ, నటుడు బాబీ డియోల్ కూడా వీళ్లతో పాటు కనిపించారు.
మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్‌కి మంచి అనుబంధం ఉంది. కొన్నేళ్ల క్రితం చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సల్మాన్ మూవీ 'కిసీ కా బాయ్ కిసీ కా జాన్'లో చరణ్ అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా ఆ అనుబంధం దృష్ట్యా సల్మాన్ బర్త్ డే పార్టీలో చరణ్ సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)


