మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళ వాడే అయినప్పటికీ అడపాదడపా మన దగ్గర కూడా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ టైంలో అయితే 'కింగ్డమ్'తో వచ్చాడు. కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న అనిరుధ్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా అనే సందేహం వస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో.. ఈ పుకార్లు నిజమేనేమో అనే హింట్ ఇస్తోంది.
(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)
చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనిరుధ్.. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నాడు. గతంలో హీరోయిన్ ఆండ్రియాతో రూమర్స్ వినిపించాయి. కానీ గత కొన్నేళ్ల మాత్రం ఇతడి పాటలు మాత్రమే వినిపించాయి. కానీ ఈ ఏడాది జూన్‌లో మాత్రం అనిరుధ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోనున్నాడనే రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందించిన అనిరుధ్.. చిల్ గాయ్స్ అలాంటిదేం లేదని ట్వీట్‌తో క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు కావ్యతోనే కనిపించడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.
యూకేకి చెందిన ఓ యూట్యూబర్.. న్యూయార్క్‌లో వ్లాగ్స్ తీశాడు. అయితే ఓ వీడియోలో అనిరుధ్-కావ్య జంటగా నడుస్తూ కనిపించారు. అంటే ఇద్దరూ కలిసి ట్రిప్ వేశారని నెటిజన్లు అంటున్నారు. దీంతో పెళ్లి వార్తలు నిజమేనా అని రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. త్వరలోనే అనిరుధ్.. కళానిధి మారన్‌కి అల్లుడు కాబోతున్నాడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి అటు అనిరుధ్, ఇటు కావ్య సింగిల్‌గానే ఉన్నారు. కెరీర్ పరంగా ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు. ఒకవేళ రూమర్స్ నిజమైతే మాత్రం పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారో చూడాలి?
(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?)
— ranjii.in (@Ranjiiin) November 12, 2025


