మరోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈషా డియోల్‌

Esha Deol Was Blessed A Baby Girl - Sakshi

బాలీవుడ్ న‌టి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జ‌న్మ‌నిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, తన కూతురు పేరు మిరయా తక్తానీ అని తెలిపారు. హేమ మాలిని, ధ‌ర్మేంద్ర‌ల కూతురైన ఈషా.. భ‌ర‌త్‌ త‌క్తానీని 2012లో పెళ్లి చేసుకోగా.. అక్టోబ‌ర్ 2017 ఈ దంప‌తుల‌కి రాధ్య జ‌న్మించింది. తాజాగా తనకు రెండోసారి ఆడపిల్ల జన్మించిందని, ఆ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకున్నారు.

రెండో కాన్పు ద్వారా ఆడ‌బిడ్డ జ‌న్మించింద‌ని ఇషా డియోల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ‌, ఆశీర్వాదానికి ధ‌న్య‌వాదాలు అని ఇషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్ళి త‌ర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాల‌కి దూర‌మయ్యారు. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈషా డియోల్.. ధూమ్, యువ‌, నో ఎంట్రీ, ధ‌స్ చిత్రాల‌తో ఈషా బాగా పాపుల‌ర్ అయ్యారు. త‌న‌కి మ‌రో కూతురు జ‌న్మించ‌డంతో హేమమాల‌ని దంప‌తులు సంతోషంగా ఉన్నార‌ని ఈషా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top