నా కోసమే పుట్టారు అనిపించింది: హేమమాలిని

Hema Malini Shares About Her Married Life With Dharmendra - Sakshi

న్యూఢిల్లీ : ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని అలనాటి డ్రీమ్‌గర్ల్‌, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలికి తన కూతుళ్లు, మనవలతో జీవితం గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హేమ మాలిని.. ధర్మేంద్రతో ప్రేమ, పెళ్లి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు. ‘ ధరమ్‌ జీని చూసిన నిమిషంలో ఈయన నా మనిషి.. నా కోసమే పుట్టారు అనిపించారు. అందుకే ఆయనతోనే జీవితం గడపాలనుకున్నా. అందుకోసం ఆయనను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నా. అయితే మా పెళ్లి ఎవరినీ బాధించుకూడదనే.. నేనెప్పుడూ ధర్మేంద్రను ఆయన మొటటి భార్య, పిల్లలకు దూరంగా ఉండనివ్వలేదు. వాళ్లు కూడా నేను ఏనాడు వాళ్ల జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా భావించలేదు. ఆయనను వివాహం చేసుకున్నానే తప్ప.. కుటుంబ సభ్యుల నుంచి ఏనాడు వేరుచేయలేదు’ అని పేర్కొన్నారు.

ఇక బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారు. వారిలో సంజీవ్‌ కుమార్‌ ఒకడు. ఆ తర్వాత జితేంద్ర ఆ ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరు మద్రాసులో వివాహం చేసుకోవడానికి దాదాపు తేదీ ఖరారు చేశారు. అయితే అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్‌ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్‌ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో మద్రాసులో జరుగనున్న పెళ్లిని ఆపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో హేమమాలిని అడుగుపెట్టారు. అయితే... రెండో భార్యగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇద్దరూ ఆ బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా విమర్శలకు దిగలేదు. వారిరువురూ కలిసి ప్రయివేట్‌గా కనిపించడం కూడా చాలా అరుదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్‌ డియోల్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్‌ కౌర్‌ సంతానం సన్నీ డియోల్‌, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top