'ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు'.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం | Megastar Chiranjeevi Condolences to Dharmendra Family | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు'.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం

Nov 24 2025 5:09 PM | Updated on Nov 24 2025 6:05 PM

Megastar Chiranjeevi Condolences to Dharmendra Family

బాలీవుడ్ నట దిగ్గజం ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. కష్ట సమయంలో నా స్నేహితులు సన్నీ డియోల్, బాబీ డియోల్ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుందని మెగాస్టార్ తెలిపారు.

చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ధర్మజీ కేవలం ఒక దిగ్గజ నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన మనిషి కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ వినయం, ఆప్యాయతను నేర్చుకున్నా. ఆయన మాటలు నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు, వ్యక్తిగత క్షణాలను జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా. మృతికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుంది. ఓం శాంతి' అంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.

జూనియర్ ఎన్టీఆర్ సంతాపం

ధర్మేంద్ర మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ధర్మేంద్ర జీ మరణవార్త విని చాలా బాధపడ్డా.. ఆయన గొప్ప శకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము.. భారతీయ సినిమాకు తీసుకొచ్చిన గొప్పతనం ఎప్పటికీ మనతో ఉంటుందని ట్వీట్ చేశారు. సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానంటూ పోస్ట్ చేశారు.

 

ధర్మేంద్ర మరణంతో రామ్ చరణ్ మూవీ పెద్ది టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజు ప్రకటించాల్సిన అనౌన్స్మెంట్ను వాయిదా వేసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఇవ్వాల్సిన అప్డేట్ను పోస్ట్ పోన్చేస్తున్నట్లు పెద్ది సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ట్వీట్ చేసింది. ధర్మేంద్ర మరణం పట్ల సంతాపం తెలిపారు మేకర్స్.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement