ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్‌కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.
అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?)





