తెలుగు రాష్ట్రాల్లో 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ కూడా పెరగనున్నాయి. అయితే, ఉత్తర అమెరికాలో కూడా చిరంజీవి సత్తా చాటుతున్నారు. ఓవర్సీస్‌లో బాలకృష్ణ అఖండ-2 సినిమాకు వచ్చిన ఫైనల్ కలెక్షన్స్‌ను కేవలం ప్రీమియర్స్‌తోనే మన శంకరవరప్రసాద్ గారు దాటేశారు. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో అక్కడ బుకింగ్స్ జోరు కనిపిస్తుంది.

బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఫైనల్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ (రూ. 9కోట్లు) రాబట్టింది. అయితే, 'మన శంకరవరప్రసాద్ గారు' కేవలం ప్రీమియర్స్ ద్వారానే 1.2 మిలియన్ డాలర్స్( రూ.11కోట్లు) రాబట్టాడు. దీంతో ఇండస్ట్రీ కూడా ఆశ్యర్యపోతుంది. భారీ సినిమాలు పోటీ ఉండగా ఇంతటి రేంజ్‌లో కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషోలో కేవలం 24గంటల్లో 5లక్షలకు పైగా టికెట్లు కొనుగోలు చేశారు.
ప్రీమియర్స్ పూర్తికాగానే చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. చిరంజీవి, అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆపై కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


