తిరుచానూరులో⁠ ⁠వైభవంగా రథోత్సవం | A grand chariot festival in Tiruchanur | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

Nov 24 2025 3:17 PM | Updated on Nov 24 2025 3:27 PM

A grand chariot festival in Tiruchanur1
1/14

A grand chariot festival in Tiruchanur2
2/14

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది.

A grand chariot festival in Tiruchanur3
3/14

ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నంలో ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.

A grand chariot festival in Tiruchanur4
4/14

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

A grand chariot festival in Tiruchanur5
5/14

రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు.

A grand chariot festival in Tiruchanur6
6/14

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

A grand chariot festival in Tiruchanur7
7/14

ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వి. వీర బ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, శ్రీ శ్రీనివాసా చార్యులు, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

A grand chariot festival in Tiruchanur8
8/14

A grand chariot festival in Tiruchanur9
9/14

A grand chariot festival in Tiruchanur10
10/14

A grand chariot festival in Tiruchanur11
11/14

A grand chariot festival in Tiruchanur12
12/14

A grand chariot festival in Tiruchanur13
13/14

A grand chariot festival in Tiruchanur14
14/14

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement