కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్‌లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 'తేరే ఇష్క్ మే' సినిమాతో బాలీవుడ్‌లో సందడి చేయనున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.
లవ్ ఫెయిల్యూర్
సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్ ఫెయిల్యూర్ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్ ఫెయిల్యూర్ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు.
చాలా కష్టం
ఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్ మే సినిమాలో శంకర్ పాత్ర కూడా చాలెంజెస్‌తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్ ఎల్. రాయే తెరకెక్కించాడు.
చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రాజాసాబ్ డైరెక్టర్ క్షమాపణలు


