డార్లింగ్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ హారర్ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.
మారుతిపై ట్రోలింగ్
సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్ వార్ 2 రిలీజ్ సమయంలో తన రెండు కాలర్స్ పైకి ఎగరేసి చూపించారు.
క్షమాపణలు చెప్పిన మారుతి
ఇప్పుడు మారుతి.. ప్రభాస్ కటౌట్‌కి కాలర్ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు.
నా ఉద్దేశం అది కాదు
ముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్‌గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు.
Dear Venky…
Felt like clarifying this personally.
First I sincerely apologise to every fan. It was never my intention to hurt or disrespect anyone. Sometimes in the flow of words things come out differently from what we truly mean and I regret that it was received in the wrong…— Director Maruthi (@DirectorMaruthi) November 24, 2025


